Thursday, November 7, 2024

ప్రేమించారు… పెళ్లాడారు…

ప్రేమకథా చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది. దాదాపు ప్రతి సిని మాలో ప్రేమ కథ కనిపిస్తుంటుంది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడమే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రేమకు కులం, మతం, ప్రాంతం అడ్డుకాదని సందేశం కూడా ఇస్తుంటారు. తెరపై అనేక ప్రేమకథలను ఆవిష్కరించగా, వాటిలో నటించిన నటీనటులు నిజజీవితంలో కూడా ప్రేమవివాహాలు చేసుకోవడం విశేషం.
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ఏదో తెలియని ఓ అనుభూతి అందరిలోనూ కలుగుతుంది. మన హీరోలకు కూడా వాలం-టైన్స్‌ డే చాలా స్పెషల్‌. ఎందుకంటే దక్షిణాదిలో చాలా మంది హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవిత భాగస్వామిని వెతుక్కు న్నారు. పెద్దలను ఒప్పించి కొందరు.. ఎదిరించి మరికొందరు ఒక్కట య్యారు. చిన్ననాటి స్నేహితురాలిని వివాహం చేసుకున్న వారు కూ డా ఉన్నారు. కొందరు తమ పక్కన నటించిన నాయికలను పెళ్లా డారు. తమ ప్రేమలోని మాధుర్యాన్ని ప్రపంచానికి చూపించారు. అ లా ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ జంటలు ఏవో ఒక్కసారి చూద్దాం..
మహేష్‌ బాబు – నమ్రత.. మహేష్‌ బాబు ప్రేమ కథ గురించి అందరికీ తెలిసిందే. ‘వంశీ’ సినిమాలో పరిచయమైన నమ్రతను ప్రేమించి 2005లో పెళ్లి చేసుకున్నాడు.


అల్లు అర్జున్‌ – స్నేహా రెడ్డి… అల్లు అర్జున్‌ సైతం ప్రేమ వివాహమే చేసుకున్నాడు. తాను ప్రేమించిన తెలంగాణ ప్రాంతానికి చెందిన స్నేహా రెడ్డిని ఇంట్లో పరిచయం చేసి.. ఒప్పించి 2011లో పెళ్లి చేసుకున్నాడు బన్నీ.
రానా- మిహీకా బజాజ్‌.. వీరిది ప్రేమవివాహం. ప్రేమలో పడి.. పెళ్లి వరకు వచ్చాడు రానా. 2020లో తను ప్రేమించిన మిహీకాను పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా కరోనా సమయమది. అనేక నిబంధ నల నడుమ వీరి వివాహం జరిగింది. అందరికీ షాక్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌ లీడ్‌ చేస్తున్నాడు.
నితిన్‌ – షాలిని.. ఇది కూడా ప్రేమ పెళ్లే. ఐదేళ్లుగా షాలిని అనే అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. 2020 లో నితిన్‌, షాలిని వివాహం జరిగింది.
శ్రీకాంత్‌ – ఊహ.. ‘ఆమె’ సినిమాతో టాలీవుడ్‌ ఎం ట్రీ ఇచ్చిన ఊహను ఇష్టపడిన శ్రీకాంత్‌ పెద్దలను ఒప్పిం చి పెళ్లి చేసుకున్నారు.
నాగార్జున – అమల.. నాగార్జున కూడా ప్రేమ పెళ్లే చేసుకున్నాడు. హీరోయిన్‌ అమలను ప్రేమించి 1992లో పెళ్లి చేసుకున్నాడు నాగార్జున.
నాని – అంజనా: న్యాచురల్‌ స్టార్‌ నాని ప్రేమ కథ కూడా భిన్నంగా ఉంటు-ంది. సినిమా రేంజ్‌లో ఉంటు-ంది ఈ ఇద్దరి లవ్‌ స్టోరీ. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్నపుడే అంజనా ప్రేమలో పడి పోయాడు నాని. తాను హీరో అయిన తర్వాత ఇంట్లో ఒప్పించి 2012లో ఒక్కటయ్యారు .
మంచు విష్ణు – విరోనికా: మంచు విష్ణు సైతం ప్రేమ పెళ్లే చేసు కున్నాడు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తమ్ముడు కూతురు అయిన విరో నికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరి పెళ్లి 2008లో జరిగింది.
రాజశేఖర్‌ – జీవిత: వీరిదీ ప్రేమ వివాహమే. 1991లో జీవిత, రాజశేఖర్‌ పెళ్లి చేసుకున్నారు.
సూర్య – జ్యోతిక: తమిళ హీరో సూర్య నటి జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2006లో ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.
రామ్‌ చరణ్‌ – ఉపాసన: మెగా వారసుడు రామ్‌ చరణ్‌ సైతం ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. 2012లో ఒక్కటయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement