Friday, November 22, 2024

పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

టోక్యోలో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో భారత్‌ మరో పతకం సాధించింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్‌లో గ్రేట్‌ బ్రిటన్‌కు చెందిన జోనాథన్‌ ఎడ్‌వర్డ్స్‌ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్‌ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు.

దీంతో జొనాథన్‌ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్‌ కుమార్‌ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక పోలాండ్‌కు చెందిన మసీజ్‌ లెపియాటోకు బ్రోన్జ్‌ మెడల్‌ దక్కింది. ప్రవీణ్‌ కుమార్‌ సిల్వర్‌ మెడల్‌తో పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల సంఖ్య 11కు చెరింది. ఇందులో రెండు బంగారు (అవని లెఖారా, సుమిత్‌), ఆరు సిల్వర్ (ప్రవీణ్‌ కుమార్‌, మరియప్ప తంగవేల్‌, దేవేంద్ర ఝజారియా, యోగేష్‌ కథునియా, నిషద్‌ కుమార్‌, భవీనాబెన్‌ పటేల్‌) ‌, మూడు వెండి (శరద్‌ కుమార్‌, సిఘ్రాజ్‌ అధనా, సుందర్‌ సింగ్‌ గుర్జర్‌) పతకాలు ఉన్నాయి.

ఈ వార్త కూడా చదవండి: నాలుగో టెస్టులో అశ్విన్‌కు లేకపోవడంపై విమర్శలు

Advertisement

తాజా వార్తలు

Advertisement