విశ్వ క్రీడలు ఒలింపిక్స్ పై కరోనా ప్రభావం చూపిస్తూనే ఉంది. మొదట నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న ఇప్పుడు ఎట్టకేలకు గేమ్స్ ఆరంభానికి అంతా సిద్దమయింది. అయితే క్రీడాకారుల్లో కొంత మందికి కోవిడ్ సోకుతుండటంతో కొత్త రూల్ ని తీసుకువచ్చారు నిర్వహకులు…అదేంటంటే గెలిచిన అభ్యర్థులు ఈసారి ఎవరి మెడల్స్ వాళ్లే మెడలో వేసుకోవాలని నిర్వాహకులు స్పష్టం చేశారు. హ్యాండ్‌షేక్స్, హగ్స్ కూడా ఉండవు. ఓ ట్రేలో మెడల్స్ తీసుకొని వస్తే.. పోడియంపై ఉన్న అథ్లెట్లు వాటిని తీసుకొని మెడలో వేసుకోవాలి.
ఈసారి గేమ్స్‌లో మెడల్స్‌ను మెడలో వేయబోవడం లేదని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాక్ కూడా స్పష్టం చేశారు. మెడల్స్‌ను ట్రేలో పెట్టే ముందు కూడా చేతులకు గ్లోవ్స్ వేసుకుంటారు. వాటిని ఇచ్చేవాళ్లు, అథ్లెట్లు కూడా మాస్కులు వేసుకుంటారు. హ్యాండ్‌షేక్స్, హగ్స్‌లాంటివి ఏమీ ఉండవు అని బాక్ తేల్చి చెప్పారు. ఈ గేమ్స్‌కు ఆతిథ్యమిస్తున్న టోక్యోలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. అక్కడ బుధవారం 1149 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల్లో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
ఇది కూడా చదవండి: టీమిండియా క్రికెటర్ కి కరోనా