టోక్యో ఒలింపిక్స్ లో భారత హాకీ జట్లు అదరగొడుతున్నాయి. నిన్న మెన్స్ హాకీ జట్టు సెమీఫైనల్ లో అడుగు పెట్టి చరిత్ర సృష్టించగా నేడు భారత మహిళా జట్టు కూడా కొత్త చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 గోల్స్ తేడాతో గెలిచిన ఇండియా.. సెమీస్‌లో బెల్జియంతో తలపడనున్నది. ఆట రెండవ అర్థభాగంలో గుర్జిత్ కౌర్ ( Gurjit Kaur ) అద్భుతమైన గోల్ చేసింది. అయితే ఆట మొత్తం లీడింగ్‌లో ఉన్న ఇండియా.. ఆస్ట్రేలియాకు షాకిచ్చింది. భారత మహిళల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో సెమీస్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. పతకం సాధించాలనే పట్టుదలతో క్వార్టర్ ఫైనల్ లో మూడు సార్లు ఒలింపిక్స్ విజేతలైన ఆస్ట్రేలియా జట్టుపై మన అమ్మాయిలు పూర్తి ఆధిపత్యాన్ని సాగించారు. మైదానమంతా పాదరసంగా కదులుతూ మన అమ్మాయిలు వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. భారత్ నుంచి గుర్జీత్ కౌర్… గోల్ చేసి భారత్‌కు తొలి పాయింట్ అందించింది.
ఒలింపిక్స్ లో తొలిసారిగా విమెన్స్ ఒలింపిక్ ఫీల్డ్ హాకీ పోటీలను 1980లోనిర్వహించింది. అప్పుడు ఒలింపిక్స్ మాస్కోలో జరిగాయి. ఒలింపిక్స్ లో విమేన్ హాకీ ని ప్రవేశ పెట్టిన 36 ఏళ్ల తరువాత తొలిసారిగా 2016 లో రియో ఒలింపిక్స్ లో భారత మహిళా జట్టు పాల్గొంది. అయితే అప్పుడు గ్రూప్ స్టేజ్ లో ఎలిమినేటి అయ్యింది. అయితే ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం మన అమ్మాయిలు.. తడబడుతూ మొదలు పెట్టిన జర్నీని .. విజయం దిశగా తీసుకునివెళ్ళారు. చరిత్ర సృష్టించారు.
ఈ సారి మహిళల జట్టు నాకౌట్ దశలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించింది. పూల్ ఏ లో ఇండియన్ జట్టు నాలుగవ స్థానంలో నిలిచింది. గ్రూపు స్టేజ్‌లో రెండు విజయాలు, మూడు పరాజయాలను నమోదు చేసింది. అయితే ఇవాళ జరిగిన మ్యాచ్‌లో నిజానికి ఆస్ట్రేలియానే ఫెవరేట్. వరల్డ్ నెంబర్ టూ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాను ఇండియా మట్టికరిపించిన తీరు ప్రశంసనీయం. హాకీలో నెదర్లాండ్స్ ఫస్ట్ ర్యాంక్‌లో ఉంది.
ఇది కూడా చదవండి: నాగార్జున సాగర్ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేత..