టోక్యో ఒలంపిక్స్ లో మరో భారత అథ్లెట్ మెడల్ రుసులో నిలిచింది. గోల్ఫర్ అదితి అశోక్ అద్భుతం ప్రదర్శనతో మెడల్ దిశగా దూసుకుపోతోంది. అంతేకాదు ప్రస్థుతం లిస్టులో రెండవ స్థానంలో కొనసాగుతోన్న అదితి అశోక్ గోల్డ్ మెడల్ కొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదు.. మొదటి స్థానంలో ఉన్న రల్డ్ నంబర్ వన్ గోల్ఫర్ నెల్లీ కోర్డా కి అదితికి మూడు పాయింట్లు మాత్రమే తేడా ఉంది. 5 బర్డీస్ (1-అండర్ పార్)తో ఆమె రెండో స్థానంలో నిలిచింది. రెండోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న ఈ 23 ఏళ్ల గోల్ఫర్ మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో శుక్రవారం మూడో రౌండ్ ముగిసే సమయానికి రెండో స్థానంలో నిలిచి మెడల్ వేటలో కొనసాగుతోంది.
గత మూడు రోజులుగా ఆమె నిలకడగా రాణిస్తోంది. శనివారం చివరిదైన నాలుగో రౌండ్‌లో ఇదే నిలకడ కొనసాగిస్తే ఆమె మెడల్ ఖాయం చేసుకుంటుంది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుఝామున 3 గంటలకే ఈ నాలుగో రౌండ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే పెద్దగా అంచనాలు లేకుండా బరిలో దిగిన బాక్సర్ లవ్లీనా, రెజ్లర్ రవి దహియా, హాకీ మెన్స్ టీమ్ మెడల్స్ తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: ఇకపై మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న: ప్రధాని మోదీ