ఒలింపిక్స్‌లో ఇండియన్ కు మరో మెడల్ ఖాయమయింది. 64-69 కేజీల విభాగంలో క్వార్టర్ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్‌పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. బాక్సింగ్ సెమీస్ ఫలితంతో సంబంధం లేకుండా ఇండియాకు మరో మెడల్ ఖాయం. సెమీస్‌లో ఒకవేళ లవ్లీనా ఓడినా.. బ్రాంజ్ మెడల్ మాత్రం ఖాయం. లవ్లీనా మూడు రౌండ్లలోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రౌండ్లో 3:2 తో ఆధిక్యంలో ఉండగా.. రెండో రౌండ్లో మొత్తం ఐదుగురు జడ్జీలు లవ్లీనాకే 10 స్కోరు ఇచ్చారు. ఇక మూడో రౌండ్లో నలుగురు లవ్లీనా వైపే మొగ్గారు. దీంతో ఆమె 4-1తో గెలిచి సెమీస్‌లో అడుగుపెట్టింది.
ఇక ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగంలో దీపికా కుమారి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. రౌండ్ ఆఫ్ 8లో భాగంగా రియో ఒలింపిక్స్ రజత పతక విజేత పెరోవాతో జరిగిన పోరులో దీపిక 6-5తో విజయం సాధించింది. ఐదు సెట్లలో దీపిక రెండు సెట్లను గెలుచుకోగా, పెరోవా రెండు సెట్లను దక్కించుకుంది. మరో సెట్ టై అయింది. అయితే, దీపికకు స్ప్లిట్ పాయింట్లు దక్కాయి. అనంతరం జరిగిన షూటవుట్‌లో రష్యాకు చెందిన పెరోవా ఏడు పాయింట్లు మాత్రమే సాధించింది. 10 పాయింట్లు సాధించిన దీపిక మ్యాచ్‌ను కైవసం చేసుకుని క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది.
మరోవైపు, మహిళల 60 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో భారత బాక్సర్ సిమ్రన్‌జీత్ కౌర్ ఓటమి పాలైంది. థాయిలాండ్‌కు చెందిన సుదాపోర్న్ చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలైంది. అలాగే, మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ క్వాలిఫికేషన్ రౌండ్లోనూ భారత్‌కు నిరాశే ఎదురైంది. 290 పాయింట్లతో మనుబాకర్ 15వ స్థానంతో, సర్నబోత్ రహీ 286 పాయింట్లతో 32వ స్థానంలో నిలిచి ఫైనల్ రౌండ్‌కు అర్హత కోల్పోయారు.
ఇది కూడా చదవండి: రూపాయికే పేదలకు ఇళ్లు ఇస్తే కడుపు మంటః మంత్రి బొత్స