నిజామాబాద్ జిల్లాలో లక్కీ లాటరీ పేరిట కోట్ల రూపాయలు టోకరా వేసి రెండు సంవత్సరాలైనా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు బుధవారం నిజాంబాద్ నగరంలోని ఒకటవ టౌన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. షైన్ ఎంటర్ప్రైజెస్ పేరిట నెలకు రూ.1000 చొప్పున 20 నెలల కాలపరిమితితో లాటరీ డబ్బులు కట్టినట్లు తెలిపారు. మొత్తం 350 మంది సభ్యుల ఉన్నట్లు పేర్కొన్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఎన్నో ఆశలతో బహుమతులు వస్తాయని లాటరీ స్కీం కట్టినట్లు తెలిపారు. మా డబ్బులు మాకు ఇప్పించాలని రెండు సంవత్సరాల నుండి తిరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయమై లక్కీ లాటరీ నిర్వాహకుని అడిగితే డబ్బులు ఇవ్వడం దేవుడి ఎరుగు భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా పోలీసులు వెంటనే స్పందించి విచారణ చేపట్టి మా డబ్బులు మాకు ఇప్పించి మమ్మల్ని ఆదుకోవాలని బాధితులు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement