బంగారం, వెండి ధరల తగ్గుదల ఒక్క రోజు ముచ్చటనే మిగిలింది. పసిడి రేటు నేడు స్థిరంగానే కొనసాగింది. బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. పుత్తడి నిలకడగా కొనసాగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. సిల్వర్ ధరలో కూడా మార్పు లేదు. బంగారం, వెండి కొనుగోలు దారులకు ఇది కాస్త ఊరట కలిగించే అంశమనే చెప్పుకోవాలి. నిన్న బంగారం, వెండి ధరలు నేల చూపులు చూసిన విషయం తెలిసిందే. జూన్ 20న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర రూ. 51,980 వద్ద ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఈ రేటు వర్తిస్తుంది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ బంగారం ధర పది గ్రాములకు రూ. 47,650 వద్ద ఉంది. నిన్న ఈ పసిడి రేట్లు వరుసగా రూ. 120, రూ. 100 చొప్పున తగ్గిన విషయం తెలిసిందే. అదేసమయంలో వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కేజీకి రూ. 66,300 వద్ద ఉంది. నిన్న వెండి ధర కేజీకి రూ. 300 ర్యాలీ చేసింది.
దేశంలోని ఇతర ప్రాంతాల్లో 10 గ్రాముల గోల్డ్ రేట్లను గమనిస్తే..
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర రూ. 52,010 వద్ద ఉంది. 24 క్యారెట్లకు ఇది వర్తిస్తుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,680 వద్ద ఉంది, బెంగళూరులో గోల్డ్ రేట్లను గమనిస్తే.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,680 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 52,101 వద్ద కొనసాగుతున్నాయి, చెన్నైలో పసిడి రేట్లు స్థిరంగానే ఉన్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 52,090 వద్ద ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 47,750 వద్ద నిలకడగా కొనసాగుతోంది, ఆర్థిక రాజధాని ముంబైలో రేట్లను చూస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 51,980 వద్ద, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 47,650 వద్ద ఉంది.