Tuesday, November 26, 2024

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. ఎంతంటే..

బంగారం ధరలు ప్రతి రోజూ మారుతూ ఉండొచ్చు. ఈరోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. జూన్ 21న హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 100 పెరిగింది. పది గ్రాములకు రూ. 52,080కు చేరింది. ఇది 24 క్యారెట్ల బంగారానికి వర్తిస్తుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు విషయానికి వస్తే.. ఇది రూ. 100 పెరుగుదలతో రూ. 47,750కు ఎగసింది. నిన్న నిలకడగా కొనసాగిన పసిడి రేట్లు ఈరోజు పైకి చేరడం గమనార్హం. అమెజాన్ మాన్సూన్ కార్నివాల్ | 18th-22nd జూన్ వరకు | టాప్ సెల్లింగ్ మొబైల్స్ & యాక్సిసరీలపై 40% వరకు తగ్గింపు. హైదరాబాద్‌లో వెండి ధర కేజీకి రూ. 66,300 వద్దనే కొనసాగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరను గమనిస్తే.. 0.14 శాతం మేర పైకి చేరింది. దీంతో పసిడి రేటు 1843.1 డాలర్ల వద్ద కదలాడుతున్నాయి. అంటే బంగారానికి ఇది కీలక స్థాయి అని చెప్పుకోవచ్చు. అదేసమయంలో వెండి రేటు కూడా పైకి చేరింది. దీని ధర 0.27 శాతం మేర పెరిగింది. దీంతో సిల్వర్ రేటు ఔన్స్‌కు 21.64 డాలర్ల వద్ద కదలాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement