Tuesday, November 26, 2024

Big story | నేడే లష్కర్‌ బోనాలు.. తొలిపూజ చేయనున్న మంత్రి తలసాని

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాలకు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాంకాళి ఆలయం ముస్తాబు అయింది. ఆదివారం తెల్లవారు జామునుంచి లష్కర్‌ బోనాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రి, సికింద్రాబాద్‌ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుటంబసభ్యులతో కలిసి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన అనంతరం ఉదయం 4 గంటలకు బోనాలు సమర్పించడం ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సమీపంలోని యాదయ్య నగర్‌ లోని మొండా మార్కెట్‌ సమీపంలో ఉదయం 9.30 కి నిర్వహించే ప్రత్యేక పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు.

సింకింద్రాబాద్‌ మహాంకాళి అమ్మవారికి లక్షలాది మంది భక్తులు అమ్మవారకి బోనాలు సమర్పించనుండటంతో పోలీసులు భారీ బందో బస్తు ఏర్పటు చేశారు. మహంకాళి పోలీసు స్టేషన్‌ లో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించనున్నారు. ఈ కంట్రోల్‌ రూం పోలీసు కామాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానం చేసి సీసీ కెమెరాల నిఘా పెంచారు. సుమారు 5లక్షల మంది బోనాలు సమర్పించనున్నట్లు ప్రభుత్వం అంచనావేసింది. ఈమేరకు అనేక ప్రభుత్వ సంస్థల సమన్వయంతో భారీ ఏర్పాట్లు చేశారు. అమ్మవారి దర్శనం కోసం పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, సెలబ్రేటీలు, స్థానిక నాయకులు రానున్నారు.

- Advertisement -

వీరితో పాటుగా హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్రమంత్రి బండారుదత్తాత్రేయ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, టీఎస్‌ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తో పాటుగా పలురాజకీయ పార్టీలనాయకులు అమ్మవారిని దర్శించుకోనున్నారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు తెలుస్తుంది. బోనాల వేడుకల్లోప్రధాన ఘట్టం రంగం సోమవారం జరగనుంది.

పోతరాజుల ఆటలు, శివసత్తుల పూనాకాలు, ఘాటాల,ఊరేగింపులతో సింకింద్రాబాద్‌ బోనం ఎత్తనుంది. అవివాహితైన జోగిన భవిష్యవాణి చెప్పడం ఈ రంగం ప్రాధాన్యత. అలాగే గజరాజుపై అమ్మవారి ఊరేగింపు. అనంతరం హైదరాబాద్‌ పాతబస్తీ బోనాలు ఈనెల 16,17న జరగనున్నాయి. గోల్కొండ రాజుల కాలం నాటి లాల్‌ దర్వాజా సింహవాహినీ, ఉప్పుగూడ, మీరాలం మండి, సుల్తాన్‌ షాహీలోని జగదాంబిక ఆలయం, శాలిబండ, గౌలిపురా, బంగారుమైసమ్మ, చందూలాల్‌ బేలా ముత్యాలమ్మ ఆలయాలతో పాటుగా వందలాది అమ్మవారి ఆలయాల్లో బోనాలు సమర్పించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement