వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నిన్న (శనివారం) జరిగిన మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. కీలకమైన నాల్గవ మ్యాచ్‌లో విండీస్ నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 17 ఓవర్లలోనే ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు జైస్వాల్, గిల్ స్వైరవిహారం చేయగా.. ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్‌సెంచరీ నమోదు చేసిన జైస్వాల్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. గిల్ 77 పరుగులు చేశాడు.
ఇక, నేడు (ఆదివారం) విండీస్ – భారత్ మధ్య ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. సిరీస్ ఎవరిది అనేది ఇవ్వాల జరగబొయే మ్యాచ్ లో తేలనుంది. ప్రస్తుతం 2-2తో సిరీస్‌ని సమం చేసిని భారత్ ఇవ్వాల జరగబొయే ఆఖరి మ్యాచ్ సైతం గెలిచి ఈ సిరీస్‌ను కూడా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు విండీస్ కూడా ఈ మ్యాచ్‌లోనే టీమిండియాను ఓడించి సిరీస్ దక్కించుకోవాలని ఆతృతగా ఉంది. ఓవరాల్‌గా ఈ మ్యాచ్ సిరీస్ విన్నర్ ఎవరు అనేది తేలనుంది..దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లు కీలకంగా మారింది.
తుది జట్లు (అంచనా)..
వెస్టిండీస్ :
కైల్ మేయర్స్, షై హోప్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, రొవ్ మన్ పావెల్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, ఒబెద్ మెకాయ్
టీమిండియా :
శుబ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ సామ్సన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్ దీప్ సింగ్, ముకేశ్ కుమార్