Saturday, November 23, 2024

పెరిగిన బంగారం ధ‌ర‌.. దూసుకుపోతోన్న వెండి

నేటి బంగారం ..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర కూడా మరోసారి పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు రూ.160 పెరిగి రూ.54,380కి చేరినట్లయింది. ఇది రూ.55 వేల మార్కుకు అటూ ఇటుగా కొనసాగుతోంది. అయితే హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో గోల్డ్ రేటు కాస్త ఎక్కువగానే ఉంటుంది.ప్రస్తుతం దిల్లీలో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.150 పెరిగి సరిగ్గా రూ.50 వేల మార్కు వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.150 పెరిగి రూ.54,530 వద్ద ట్రేడవుతోంది. ఇప్పటికే దిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు డిసెంబర్ 14న రూ.55 వేల మార్కు దాటింది. బంగారం బాటలోనే సిల్వర్ రేటు కూడా పెరిగింది.

దిల్లీలో కిలో వెండి రేటు తాజాగా రూ.1000 పెరిగి రూ.71,100కు పెరిగింది. ఇక హైదరాబాద్‌లో మాత్రం కేజీ సిల్వర్ ధర రూ.300 పెరిగి మళ్లీ రూ.74 వేల మార్కుకు పెరిగింది. అయితే హైదరాబాద్‌తో పోలిస్తే దిల్లీలో వెండి రేటు మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. సుమారు రూ.3 వేలు తేడా ఉండటం గమనార్హం. స్థానిక పరిస్థితులు, పన్నులను బట్టి గోల్డ్, సిల్వర్ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి.అంతర్జాతీయంగా గోల్డ్, సిల్వర్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1799 డాలర్ల వద్ద ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ఇవి వరుసగా 1820, 24.20 డాలర్లపైన ట్రేడవడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement