Sunday, November 17, 2024

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు

నేటి బంగారం..వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో సిల్వర్, గోల్డ్ రేట్లు ఇవాళ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రితం సెషన్‌తో పోలిస్తే ఇవాళ కాస్త పుంజుకున్నాయి. అయితే, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలతో ఇటీవలి కాలంలో భారీగానే దిగివచ్చాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు 1955.50 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక స్పాట్ సిల్వ ధర ఔన్సుకు మరింత పడిపోయింది. ప్రస్తుతం 23.13 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇండియన్ రూపాయి మారకం విలువ అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం రూ.82.778 మార్క్ వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ 10 గ్రాములకు రూ.100 తగ్గింది. ప్రస్తుతం తులం రేటు రూ.55 వేల 450 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములకు రూ.110 తగ్గి ప్రస్తుతం రూ.60 వేల 490 వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 600 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఢిల్లీలో 10 గ్రాములకు రూ.120 తగ్గి ప్రస్తుతం రూ.60 వేల 630 వద్ద కొనసాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement