Saturday, November 23, 2024

త‌గ్గిన బంగారం ధ‌ర‌- అదే దారిలో వెండి

నేటి బంగారం ధ‌ర‌లు కాస్త ఊర‌ట నిచ్చాయి.బంగారం ధరలు తగ్గితే.. వెండి రేటు కూడా అదే దారిలో నడిచింది. గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన సిల్వర్ రేటు ఈరోజు మాత్రం పడిపోయింది. దీంతో వెండి కొనాలని భావించే వారికి కూడా ఇది తీపికబురు అనే చెప్పాలి. జూన్ 23న హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 క్షీణించింది. దీంతో పది గ్రాముల పసిడి రేటు రూ. 47,450కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల బంగారం రేటు కూడా ఇంతే. 10 గ్రాములకు రూ. 220 క్షీణించింది. రూ. 51,760కు తగ్గింది. బంగారం ధర తగ్గడం ఇది వరుసగా రెండో రోజు. ఈ రెండు రోజుల్లో బంగారం ధర రూ. 320 పడిపోయింది. వెండి రేటును గమనిస్తే.. సిల్వర్ రేటు ఈరోజు రూ. 300 దిగి వచ్చింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 66 వేలకు తగ్గింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement