Friday, November 22, 2024

నేడు క‌రోనాపై సీఎం కేజ్రీవాల్ స‌మీక్ష‌

దేశంలో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న కేసులతో ఢిల్లీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ రోజు సీఎం కేజ్రీవాల్ అధ్యక్షతను ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. గత ఆరు నెలల కాలం తరువాత.. సోమవారం ఢిల్లీలో అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే..331 కరోనా కేసులు నమోదు కావడంతో ఢిల్లీ వాసులను కలవరానికి గురిచేస్తోంది. ఆరు నెలల కాలంలో ఢిల్లీలో ఒకే రోజు అధిక కేసులు నమోదు కావడంతో, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కింద ఎల్లో అలెర్ట్ అమలులోకి వచ్చే అవకాశముంద‌ని తెలుస్తోంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 0.5 శాతం మించిపోయింది.
మరో వైపు ఢిల్లీలో కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే కేసుల సంఖ్య 160కి పైగా నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇవాళ‌ జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఢిల్లీలో ఇప్పటికే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది సర్కార్. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ప్యూని విధించిని విష‌యం విదిత‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement