Thursday, November 14, 2024

Today Assembly – మూడు కీలక బిల్లులు – మధ్యాహ్నం కేబినెట్ భేటీ

ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ : నేడు ఎనిమిదవ రోజు అసెంబ్లీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఇవాళ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు చేసి..సభలో మూడు ప్రభుత్వ బిల్లులు ప్రవేశ పెట్టనున్నారు. న్యాయ శాఖకు చెందిన రెండు సవరణ బిల్లులు.. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

ఇప్పటికే సర్కార్ న్యాయ శాఖ బిల్లులు సభలో ప్రవేశ పెట్టింది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. సభలో హైదరాబాద్ అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

మరోవైపు ఇవాళ అసెంబ్లీ లోనే కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్నాహ్నం 2.30 కి కమిటీ హల్ 1 లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్త రేషన్ కార్డుల పై చర్చ జరగనుంది. విది విధానాలపై సర్కార్ కేబినెట్ సబ్ కమిటీ వేయనున్నారు. వైద్య శాఖలో జీవన్ దాన్ పై చర్చింనున్నారు. GHMC లో మున్సిపాలిటీలు.. మున్సిపల్ కార్పొరేషన్లు.. గ్రామాల విలీనం పై చర్చించనున్నారు. ఇక రేపు సభలో GHMC లో విలీనాలపై బిల్లు ప్రవేశపెట్టనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement