చెన్నైలోని టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో ఉదయకుమార్(28) పనిచేస్తున్నాడు. కొద్ది రోజులు గా కురుస్తున్న వర్షాలతో చలి వాతావరణంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.స్థానికులు పోలీసులకు సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ రాజేశ్వరి అక్కడికి చేరుకొన్నారు. యువకుడు బతికే ఉన్నట్టు గుర్తించి వెంటనేతన భుజాలపై ఎత్తుకొని వాహనం దగ్గరకు మోసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. యువకుడిని ప్రాణాలతో కాపాడిన ఇన్స్పెక్టర్ రాజేశ్వరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం రాజేశ్వరీని తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా ఆమెపై సీఎం ప్రశంసలు కురిపించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement