Tuesday, November 26, 2024

TMC party మేనిఫెస్టో విడుదల…

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం తమ మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ప్రతిపక్ష ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్, డిఎంకె బాటలో టిఎంసి నడుస్తూ, కేంద్రంలో బిజెపిని ఓడించిన పక్షంలో పౌరసత్వ చట్టంలో మార్పులను ఉపసంహరిస్తామని శపథం చేసింది.

దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా పది ఎల్‌పిజి సిలిండర్లు, ఐదు కిల్లో ఉచిత రేషన్లు (బియ్యం, గోధుమలు, పప్పులు) సరఫరా చేస్తామని కూడా వాగ్దానం చేసింది. ఎంఎస్‌పి వివాదంలో రైతులకు దన్నుగా ఉంటామని కూడా టిఎంసి ప్రతిన చేసింది. ‘ఉత్పత్తి సగటు వ్యయం కన్నా కనీసం 50 శాతం అధికంగా’ ఎంఎస్‌పి ధరను నిర్ధారిస్తామని టిఎంసి ప్రకటించింది. పెట్రోల్, డీజెల్ ధరలను ‘భరించగలిగే స్థాయికి పరిమితం చేస్తాం’ అని, భవిష్యత్తులో ధరల్లో మార్పులను తట్టుకునేందుకు ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయగలమని టిఎంసి హామీ ఇచ్చింది. SC, ST, OBC విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు జాబ్ కార్డ్‌దారులకు 100 రోజుల గ్యారంటీ పని కల్పిస్తామని కూడా టిఎంసి వాగ్దానం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement