Tuesday, November 26, 2024

పార్లమెంట్‌కు సైకిల్‌పై వచ్చి నిరసన తెలిపిన టీఎంసీ ఎంపీలు

దేశంలో పెరుగుతున్న పెట్రో ధరలకు నిరసనగా తృణముల్ కాంగ్రెస్ నేతలు పార్టమెంట్ కు సైకిల్ పై వచ్చి నిరసన తెలిపారు. 61 సౌత్ అవెన్యూ నుంచి తృణ‌మూల్ ఎంపీలు సైకిల్‌పై పార్ల‌మెంట్‌కు వ‌చ్చారు. నూత‌న రైతుల చ‌ట్టాల‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఇవాళ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ జ‌స్బీర్ గిల్‌, మ‌నీష్ తివారీలు ఈ తీర్మానం ఇచ్చిన‌వారిలో ఉన్నారు. సీపీఎం ఎంపీలు కూడా రైతుల నిర‌స‌న‌పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని నోటీసులు ఇచ్చారు. సీపీఎం ఎంపీ క‌రీమ్‌, వీ శివ‌దాస‌న్‌.. 267 రూల్ కింద నోటీసు ఇచ్చారు. కాగా దేశంలో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధరలు వంద రూపాయలు దాటింది. దీంతో ప్రతిపక్షాలు నిరసనల బాట పట్టాయి.

ఇది కూడా చదవండి : వీడియో: మాస్క్ పెట్టేకోలేదని ట్రైన్ నుంచి నెటేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement