Thursday, November 21, 2024

తిట్టినోళ్లే పొగిడితే ‘జర బద్రంస‌.. జనసేనాని ట్వీట్‌

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇటీవల పొత్తులపై రాజకీయ పార్టీల మధ్య వాడి వేడి విమర్శలు, వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. పొగిడిన వారంతా మారిపోయారని అనుకోవద్దని, అదంతా మైండ్‌ గేమ్‌లో భాగమని గుర్తించాలని, కనుక పొగడ్తలపై స్పందించే జనసైనికులు ‘జర బద్రం’ అని వ్యాఖ్యానించారు.
‘అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు సడెన్‌గా మనల్ని పొగడ్డం ప్రారంభిస్తారు. ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, పరివర్తన చెందాడని మనం భావించి చప్పట్లు-, ఆనందకరమైన ఎమోజీలు పెడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. అప్పటి వరకు తిట్టిన నాయకులు ఇప్పుడు ఎందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడు కదా అని ఆ నాయకుడిని హర్షాతిరేకాలతో ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్‌ గేమ్‌లో ఒక భాగమే అని గుర్తెరగాల’ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

పేరు పెట్టుకుంటే సరిపోదు.. నిధులివ్వాలి: నాదెండ్ల..

‘విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టు-కొంటే సరిపోదు వైఎస్‌ జగన్‌ గారూ! వాటికి నిధులు కూడా ఇవ్వాలి. మీ నిర్వాకం వల్ల వేల మంది పేద విద్యార్థులు విదేశాల్లో అగచాట్లు-పడుతున్నారు. వాళ్ళ ఫీజులు ఎప్పుడు చెల్లిస్తారో చెబుతారా?’ అని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ట్వీట్‌ చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి గుంటూరు పర్యటనలో ఒక వాలంటీర్‌ ట్రాక్టర్‌పై నుంచి దూకి సీఎం ఎదుట విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేయాలంటూ నినాదాలు చేసిన వార్తను ట్వీట్‌కు జత చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement