సీఎస్కే హోమ్ గ్రౌండ్ వేదికగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టు ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే గుజరాత్ ముందు 207 పరుగుల భారీ సెట్ చేసింది. అయితే, ఛేజింగ్‌లో గుజరాత్ జట్టు తడబడింది. దీంతో 08 వికెట్ల నష్టానికి 143 పరుగులకే పరిమితం కావడంతో.. సీఎస్కే 63 పరుగుల తేడాతో విజయం సాధించింది.
గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్ (31), వృద్ధిమాన్ సాహా (21), డేవిడ్ మిల్లర్ (21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సీఎస్కే బౌటర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ రెండేసి వికెట్లు తీయగా.. డారిల్ మిచెల్, మతీషా పతిరణ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లపై సీఎస్కే బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే (51).. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (46), రచిన్ రవీంద్ర (46) చెలరేగారు. డారిల్ మిచెల్ (24), సమీర్ రిజ్వీ (14), రవీంద్ర జడేజా (7) ఆకట్టుకున్నారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, స్పెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ చెరో వికెట్ దక్కించుకున్నారు.