అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అధినేత అడుగులు కదుపుతున్నారు. అందులో భాగంగా ఇప్పటికే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, విజయవాడలోని మూడు నియోజకవర్గాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురము జిల్లాల స్థాయిల్లో అధికార ప్రతినిధులను నియమించారు. తాజాగా తిరుపతి, అనంతపురము సిటీ- కమిటీ-ల నియామకానికి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఆమోదం తెలిపారు. ఇప్పటికే తిరుపతి నగర అధ్యక్షులుగా జగదీష్ రాజరెడ్డి, అనంతపురము సిటీ- అధ్యక్షులుగా పొదిలి బాబురావును నియమించించిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ రెండు సిటీ-లకు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపారు.
కమిటీల వివరాలు..
తిరుపతి నగర కమిటీ ఉపాధ్యక్షులుగా తిప్పలింగం బాబ్జీ, బొకసం అమృత, కప్పల పార్ధు, ప్రధాన కార్యదర్శులుగా దినేష్ జైన్, వీరిశెట్టి సుమన్, భునపల్లి మునస్వామి, ఆనం బలరామ్ కృష్ణ, పరిమిశెట్టి రాగసుధ, కొండా రాజమోహన్, కార్యదర్శులుగా ఈరిశెట్టి నాగార్జున(చరణ్), ఊడి సాయిదేవ్ యాదవ్, కాకర్ల హేమంత్, తాండాయ్ రాజేష్ ఆచారి, పోలిశెట్టి మోహన్ రాయల్, షేక్ షరీఫ్, రాజ రుద్రకిషోర్ రెడ్డి, బాధూర్ కోకిల, సంయుక్త కార్యదర్శులుగా బండారు కృష్ణ, పి. హేమకుమార్, సి. పవన్ కుమార్, వజగాని కోమల్ బాబు, సారాయి శ్రావణ్ కుమార్, గుడిమెట్ల జీవన్, పగడాల లోకేష్, షేక్ టిప్పు సుల్తాన్, మరుసు లావణ్య రేఖ, పెరుకల కిరణ్ కుమార్, కొబాకు దివాకర్ రెడ్డి, దుదేల మణికంఠ, ఆనట్టా భార్గవ్, ఎం. మురళీ కుమార్‌లను ఎంపిక చేశారు. అలాగే అనంతపురము సిటీ- కమిటీ-కి ఉపాధ్యక్షులుగా గుండాల సదానందం, గ్రందే దివాకర్, జక్కిరెడ్డి ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శులుగా కనికరం మేదర వెంకటేశ్వరులు, రోళ్ల భాస్కర్, కమతం వెంకట రమణ, కమతలం ఇమాం హుస్సేన్, అయ్యవారిపల్లి కాలేషా, పెండ్యాల చక్రపాణి, దండియా ధరాజ్ భాషా, కార్యదర్శులుగా కొత్తచెరువు నాగవిశ్వనాథ్, కుమ్మర మురళి కృష్ణ, బి. రాజేష్ కన్నా, శీలం శేషాద్రి గౌడ్, కుంకాల లాల్ స్వామి, కుమ్మర సువర్ణ, కంచేపు వడ్డే సాయి సంపత్ కుమార్, శింగంశెట్టి నాగార్జున, నాయకుల ఆంజినేయులు, జక్కిరెడ్డి పద్మావతి సంయుక్త కార్యదర్శులుగా బత్యాల కేశవా, షేక్ బాబా వలి, ఆకుల ప్రసాద్, బళ్లారి అశోక్, మంగళ కృష్ణ, ఆకుల అశోక్, నెట్టికంటి హరీష్, దాసరి పవన్ కుమార్, వల్లంశెట్టి వెంకట రమణ, నంబూరి జీవన్‌ల నియామకానికి పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..