ఎటువంటి కష్టం లేకుండా నడుం వంచకుండా ఇలా కూడా తమ భక్తిని చాటుకోవచ్చని తెలియచేస్తున్నారు ఈ అపూర్వ సహోదరులు.. శ్రీవారి సన్నిధికి చేరుకునేందుకు భక్తులు అనేక మ్రొక్కులతో తిరుమలకు చేరుకుంటు ఉంటారు .అందులో ప్రధానంగా కాలినడకన వస్తుంటారు.. అందుకోసం భక్తులకు అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది..
ఈ రెండు మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తులు రక రకాల మొక్కులతో కాలి నడకను ప్రారంభిస్తారు.. ఒకరు మోకాలితో నడిస్తే మరొకరు పొర్లు దండలు చేస్తూ పైకి చేరుకుంటారు.. ఇంకొకరు మెట్టు మెట్టుకు పసుపు ..కుంకుమ రాస్తూ.. కర్పూరం వెలిగిస్తూ వెళ్తారు.. అలా ఈ అపూర్వ సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటు వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు పలువురు భక్తులు.. మరి కొందరు భక్తులు ఐడియా బాగానే ఉన్నా, కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి, కష్టం లేకుండా చెలించే స్థాయికి భక్తులు ఆలోచలను వచ్చాయి అని పలువురు విమర్శిస్తున్నారు..
నడుం వంచకుండానే శ్రీవారికి మొక్కులు -ఇదో కొత్త ఐడియా
Advertisement
తాజా వార్తలు
Advertisement