చంద్రబాబుతో టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు భేటి
తెలంగాణ లేఖల అంశంపై చర్చ
వారానికి రెండు సార్లు అవకాశం ఇచ్చేందుకు సిఎం గ్రీన్ సిగ్నల్
రెండు బ్రేక్ దర్శనం, మరో రెండు రూ.300 టికెట్ దర్శనం లేఖలకు ఓకే
పాలకమండలిలో చర్చించిన తర్వాత అధికారక ప్రకటన
వెలగపూడి – : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల అంశాన్ని పునఃపరిశీలించింది. బోర్డులోని మెజారిటీ సభ్యులు కూడా సిఫారసు లేఖలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. దీంతో బోర్డు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు వారానికి రెండు సార్లు అనుమతించేలా నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ఈ రోజు సీఎం చంద్రబాబును కలిశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఇకపై తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వారానికి రెండు సిఫార్సులేఖలకు అనుమతిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు.. వారానికి 2బ్రేక్ దర్శనం సిఫార్సు లేఖలు, మరో రెండు 300రూపాయల దర్శనం సిఫార్సు కలిపి మొత్తం 4లేఖలకు అంగీకారం తెలిపారు సీఎం. దీనిపై టిటిడి పాలకమండలిలో చర్చించి అధికారికంగా ప్రకటించనున్నారు టిటిడి చైర్మన్ .