Sunday, November 24, 2024

Tirumala – ‘సేవ్‌ తిరుమల .. సేవ్‌ తితిదే’ – తిరుప‌తిలో సాధువుల ధ‌ర్నా


గ‌త పాల‌కుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్
టిటిడి ఈవో కి విన‌తి ప‌త్రం అంద‌జేత

తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై స్వామీజీలు తిరుపతిలో ఆందోళనకు దిగారు. ఏపీ, తెలంగాణ సాధు పరిషత్‌ ఆధ్వర్యంలో తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ఎదుట ధ‌ర్నా చేశారు. ‘సేవ్‌ తిరుమల.. సేవ్‌ తితిదే’ అంటూ నినాదాలు చేశారు. తిరుమలలో లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో అన్యమతస్థులను ఉద్యోగులుగా నియమించవద్దని డిమాండ్‌ చేశారు.

గత పాలకమండలి ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్‌ రెడ్డి, అప్పటి ఈవోలు జవహర్‌ రెడ్డి, ధర్మారెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తితిదే ఈవోకు వినతిపత్రం ఇచ్చేందుకు భారీగా స్వామీజీలు తరలివచ్చారు. కాగా, టిటిడి ఈవో శ్యామలరావు వారిని చర్చలకు ఆహ్వానించగా 10 మంది సాధువులు వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల‌ను అప‌విత్రం చేసిన భాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ సాధువుల బృందం ఈవోకి విన‌తిప‌త్రం అంద‌జేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement