కరోనా తగ్గుముఖం పట్టడంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల తాకిడి మళ్లీ మొదలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య గత కొన్ని నెలలుగా పడిపోయింది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుండడం, ఆంక్షలు సడలించడంతో భక్తుల ప్రవాహం మళ్లీ మొదలైంది. ఫలితంగా గత నెలలో శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.
జూలై నెలలో మొత్తం 5,32,780 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 2,55,283 మంది భక్తులు తలనీనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే, శ్రీవారికి గత నెలలో రూ. 55.55 కోట్ల హుండీ ఆదాయం లభించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: స్నేహం లేని జీవితం వ్యర్థం.. నేడే ఫ్రెండ్‌షిప్ డే