Monday, November 18, 2024

Tirumala : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 18 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పోటెత్తారు. ఆదివారం సెల‌వు దినం కావ‌డం, కొత్త సంవ‌త్స‌రం కొత్త‌గా ఆనందంగా ఉండాల‌ని భ‌క్తులు తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వ‌చ్చేశారు. భ‌క్తులు భారీగా త‌ర‌లి రావ‌డంతో టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం కోసం 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండ‌గా.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం ప‌డుతుంద‌ని అధికారులు పేర్కొన్నారు. శనివారం శ్రీవారిని 78,460 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 29,182 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.03 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

తిరుమలలో 2023 జనవరి నెలలో జరిగే ముఖ్యమైన కార్య‌క్ర‌మాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
జనవరి 7 : ప్రణయ కలహోత్సవం
జనవరి 7 నుండి 13 వరకు : ఆండాళ్ నీరతోత్సవం
జనవరి 14: భోగి
జనవరి 15: అధ్యయనోత్సవాల ముగింపు, మకర సంక్రాంతి
జనవరి 16: కనుమ, గోదా పరిణయం
జనవరి 26: గణతంత్ర దినోత్సవం, వసంత పంచమి
జనవరి 28: రథ సప్తమి

Advertisement

తాజా వార్తలు

Advertisement