Friday, January 17, 2025

ampath : ఏపీలో తమ కార్యకలాపాలు విస్తరించిన అంపత్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యక్రమాలను విస్తరిస్తూ, అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాథాలజీ & లేబొరేటరీ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ (అంపత్) ఇటీవల విజయవాడలోని రామచంద్ర నగర్‌లోని పున్నయ్య – వజ్రమ్మ కాంప్లెక్స్‌లో ల్యాబ్‌ను ప్రారంభించింది. దాదాపు 2700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లేబొరేటరీ లో, వేగవంతమైన సమయంలో ఖచ్చితత్వంతో కూడిన నాణ్యమైన నివేదికలను అందించగల తాజా సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లు అమర్చబడి ఉన్నాయి. ఈ సందర్భంగా అంపత్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ మనీష్ బగై మాట్లాడుతూ… విజయవాడలో తమ సరికొత్త ల్యాబ్‌ను ప్రారంభించడం పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామన్నారు. తమ లక్ష్య సాధనకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రముఖ మార్కెట్‌లలో ఒకటైన విజయవాడలో తమ కార్యకలాపాలను విస్తరించినందుకు తాము గర్విస్తున్నామన్నారు. ఇప్పుడు తమ ఆటోమేటెడ్ & అత్యుత్తమ శ్రేణి, అధిక నాణ్యత ప్రమాణాలతో కూడిన అధునాతన పరీక్ష ప్రొఫైల్‌తో విజయవాడ ప్రజలకు సేవ చేయగలుగుతామన్నారు.

దక్షిణాసియాలో ప్రమాణాల ఆధారిత, నిర్దిష్టమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించటంలో అంపత్ ముందుందన్నారు. తాము తమ కార్యకలాపాలన్నింటిలో అగ్రశ్రేణి సేవలు, ఆవిష్కరణలు, నాణ్యమైన ఫలితాలను అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. అంపత్ ల్యాబ్ ఆపరేషన్స్ హెడ్ – డాక్టర్ పంకజ్ కర్వా మాట్లాడుతూ… కొత్త ల్యాబ్‌ను ప్రారంభించడం, దక్షిణాదిలో తమ కార్యకలాపాలను విస్తరించడం పట్ల తాము సంతోషిస్తున్నామన్నారు. ఇక్కడ తాము విస్తృతమైన రోగనిర్ధారణ పరీక్షలను అందిస్తామన్నారు. హైటెక్ పరికరాలు, నిష్ణాతులైన నిపుణుల బృందంతో, నాణ్యమైన, మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలతో తమ కస్టమర్‌లకు నిరంతరం, సమర్ధవంతంగా సేవలందించగలమని తాము ఆశిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement