ఉన్నది ఉన్నట్టుగా ముఖాన్నే మాట్లాడటం నటుడు జగపతిబాబుకి అలవాటు. నా కెరియర్ మొదలై అప్పుడే 34 ఏళ్లు పూర్తవుతున్నాయంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. నా వరకూ నేను నా స్థాయిలో ఎంతోకొంత సాధించాననే అనుకుంటున్నాను. సినిమాలు తప్ప నాకు మరేమీ తెలియదు. ఏ బిజినెస్ లు తెలియదు .. నలుగురిలో కలవడం తెలియదు .. మాట్లాడటం తెలియదు .. మాయమాటలు చెప్పడం తెలియదన్నారు. నేను ఎప్పుడూ కూడా కమర్షియల్ గా ఆలోచించను .. కమర్షియల్ గా బిహేవ్ చేయను. ఒక రకంగా అదే లోపమేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నేను సినిమా ఫంక్షన్స్ కి కూడా వెళ్లడం మానేశాను .. ఎందుకంటే అందరినీ పొగిడీ పొగిడీ అలసిపోయాను. స్టేజ్ పై అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్లి నుంచునే అవసరం నాకులేదని చెప్పారు జగపతిబాబు.
Advertisement
తాజా వార్తలు
Advertisement