‘టిక్ టాక్’ యాప్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ యాప్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ ఇప్పుడు దానికి సంబంధించిన ఏఐ టెక్నాలజీని అమ్మేస్తోంది. ఇండియాకు చెందిన కంపెనీలు కూడా టిక్‌టాక్ టెక్నాలజీని సొంతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇండియాలో టిక్‌టాక్ యాప్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. బైట్ ప్లస్ పేరుతో టిక్‌టాక్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు చెందిన సోషల్ గేమింగ్ ఫ్లాట్‌ఫామ్‌లకు అమ్ముతోంది. గేమ్స్‌యాప్ లాంటి సంస్థతో పాటు ఫ్యాషన్ యాప్ గోట్, సింగపూర్ ట్రావెల్ సైట్ వీగో, ఇండోనేషియా షాపింగ్ యాప్ చిలీబిలీ లాంటి వాటికి కూడా టిక్‌టాక్ తన టెక్నాలజీని ట్రాన్స్‌ఫర్ చేయనుంది. చైనా యాప్‌ల ద్వారా జాతీయ భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో గత ఏడాది ఇండియాలో చాలా వరకు యాప్‌లను నిషేధించారు. అందులో ఫేమస్ టిక్‌టాక్ కూడా ఉంది.
ఈ వార్త కూడా చదవండి: జాక్‌పాట్.. లాటరీలో తగిలిన రూ.40 కోట్లు