Saturday, November 23, 2024

ప్రపంచ కుబేరుల్లోకి టిక్ టాక్ యజమాని..

టిక్ టాక్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపింది…అయితే ఆ తరువాత టిక్ టాన్ ను ఎన్నో దేశాలు నిషేధించాయి. ఇటువంటి పరిస్థితుల్లో సైతం టిక్ టాక్ ఎదురొడ్డి నిలిచింది. అంతే కాదు… టిక్ టాక్ ను స్థాపించిన జాంగ్ వైమింగ్ ను ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా చేసింది. కేవలం 38 ఏళ్ల వయసులోనే అతను ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించాడు. తాజాగా ప్రైవేట్ మార్కెట్ ట్రేడింగ్ లో కంపెనీ ఈక్విటీ వాటాల విలువ భారీగా పెరిగింది. ఫలితంగా 250 బిలియన్ డాలర్లకు బైట్ డ్యాన్స్ వాల్యూ చేరగా, అందులోని ప్రధాన అనుబంధ విభాగమైన టిక్ టాక్ వ్యవస్థాపకుడు జాంగ్ కు దాదాపు 25 శాతం వాటా ఉండటంతో అతని సంపద విలువ కూడా 60 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో అతను టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ యజమాని పోనీ మా, బాటిల్డ్ వాటర్ కింగ్ గా పేరున్న జాంగ్ షన్ షాన్, వాల్టన్ అండ్ కోచ్ ఫ్యామిలీస్ తదితరుల సరసన చేరాడని బ్లూమ్ బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement