Friday, November 22, 2024

అంగట్లో పులి చర్మం.. అడ్డంగా దొరికారు

ఏటూరు నాగారం పోలీసులు పులి చర్మం అమ్మడానికి సిద్ధంగా ఉన్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ఒక పులి చర్మంతోపాటు ఒక బైకును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ములుగు జిల్లా లోని ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద పులి చర్మం అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పులి చర్మంతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. వాజేడు మండల కేంద్రానికి చెందిన తిరుమలేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా చండూరు గ్రామానికి చెందిన సత్యం అని తేలింది. ఇన్‌చార్జి ఎఫ్‌డీఓ శ్రీగోపాల్‌రావు, ఇతర అధికారులు పులి చర్మాన్ని పరీక్షించి.. నిజమైనదేనని నిర్ధారించారు. కాగా, పులి చర్మాన్ని వరంగల్‌లోని ఓ మహిళా కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి వారు ముల్లకట్ట బ్రిడ్జి వద్దకు వచ్చారని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఇది కూడా చదవండి : దళిత బంధు ఆగే ప్రసక్తే లేదు: సీఎం కేసీఆర్

Advertisement

తాజా వార్తలు

Advertisement