Friday, November 22, 2024

బాబోయ్‌ పులి, అనకాపల్లి జిల్లాలో సంచారం.. శ్రీరాంపురంలో బ‌ర్రెపై దాడి

విశాఖ కైం, ప్రభ న్యూస్‌: ఇప్పటివరకు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ పశువులను చంపిభయపెడుతున్న పెద్దపులి నేడు జనవాస ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకు వచ్చి ప్రజలకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఆ పెద్దపులి ఒక రైతుకు చెందిన గేదెను చంపి సమీప అటవీ ప్రాంతంలో కి వెళ్ళిపోయింది.ఆ ప్రాంతంలో పులి పాదముద్రలను కూడా గుర్తించిన స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గోదావరి జిల్లాల నుంచి అటు వైపుగా విజయనగరం తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో మకాం వేసి ఆ తర్వాత అనకాపల్లి జిల్లాకు చేరి ఇక్కడ వారిని భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎప్పుడు ఒక చోట ఉండకుండా అలా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ పలు జిల్లాలలో గల అటవీ ప్రాంతాలలో తిరుగుతూ కనిపించిన పశువులను చంపి తింటోంది. ఇప్పుడు ఆ పులి అటవీ ప్రాంతాల్లోనే కాక జనావాస ప్రాంతాల్లో కూడా చొచ్చుకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం, టి.జగ్గపేట శివారు శ్రీరాంపురంలో చిన్న అనే రైతుకు చెందిన గేదెపై దాడి చేసి చంపేన వైనం తెలుసుకుని అక్కడి వారు అధికారులకు సమాచారం ఇచ్చి తక్షణమే ఆ పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. ఘటనా స్థలానికి బయలుదేరిన అటవీ శాఖ అధికారులుఆ ప్రాంతాలలో పులి పాద ముద్రలను గుర్తించిదానిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదే పులినెలన్నర క్రితం ఒడిశా నుండి సాలూరు మీదుగా ఆంధ్ర లోకి ప్రవేశించినపెద్ద పులి అల్లూరి జిల్లా లోను సంచరిస్తూ అక్కడి వారికినిద్ర లేకుండా చేసింది.

పులి సంచారం తోమన్యం లో టెన్షన్‌ వాతావరణం మొదలైంది. దీంతో ఇళ్ల నుండి ప్రజలెవరు బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఆ సమయంలో కూడా పులి కోసం అటవీ ప్రాంతం అంతా అధికారులు జల్లెడ పట్టారు ప్రయోజనం లేకుండా పోయింది.ఇటీవలే కాలంలో తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు శివారు ప్రాంతాల్లో 25 కు పైగా ఆవులు,గేదాల పై పెద్ద పులి పంజా విసిరింది.అక్కడ కూడా దీని ఆచూకీ కోసం ప్రయత్నించిన అక్కడి అధికారులకు దొరకకుండా తన మకాం మార్చింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement