అధికార భారత రాష్ట్ర సమితి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో తొమ్మిది మంది సిట్టింగులకు మరోసారి అవకాశం ఇవ్వగా ఒక ఎమ్మెల్సీకి, ఒక జడ్పీ చైర్మన్ తో పాటు ఇద్దరు కొత్త అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు. సిరిసిల్ల నుండి కేటీఆర్, కరీంనగర్ నుండి గంగుల కమలాకర్, ధర్మపురి నుండి కొప్పుల ఈశ్వర్ లకు అవకాశం ఇచ్చారు.
పెద్దపల్లి నుండి దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం నుండి కోరుకంటి చందర్, మంథని నుండి పుట్ట మధుకర్, మానకొండూరు నుండి రసమయి బాలకిషన్, హుస్నాబాద్ నుండి సతీష్ బాబు, చొప్పదండి నుండి రవిశంకర్, హుజురాబాద్ నుండి పాడి కౌశిక్ రెడ్డి, జగిత్యాల నుండి డాక్టర్ సంజయ్ లకు అవకాశం ఇచ్చారు. కోరుట్ల నుండి ప్రస్తుత ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కి అవకాశం ఇవ్వగా వేములవాడ నుండి చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం ఇచ్చారు.
బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే
- కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల
- గంగుల కమలాకర్ కరీంనగర్
- కొప్పుల ఈశ్వర్, ధర్మపురి
- దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి
- కోరుకంటి చందర్, రామగుండం
- పుట్ట మధుకర్, మంథని
- డాక్టర్ సంజయ్,జగిత్యాల
- డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కోరుట్ల
- రసమయి బాలకిషన్ మానకొండూర్
- సుంకే రవిశంకర్ చొప్పదండి
- ఓడితల సతీష్ బాబు హుస్నాబాద్
- పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్
13 చల్మెడలక్ష్మీనరసింహారావు వేములవాడ