Thursday, November 21, 2024

‘కార్డుతో టిక్కెట్‌’ ఆర్టీసీలో ఆన్‌లైన్‌ సేవలు.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్సార్టీసీ)లో త్వరలో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలో దాదాపు అన్ని సేవలు కూడా నగదురహితంగానే మారనున్నాయి. అంటే.. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో టిక్కెట్‌ కొనుగోళ్ళు జరపవచ్చు. ఈ క్రమంలో.. రాష్ట్రవ్యాప్తంగా బస్‌స్టేషన్లు, డిపోలు, ఇతరత్రా పీఓఎస్ (పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌) వద్ద.. క్యూఆర్‌ కోడ్‌లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. అలాగే.. ఈ కోడ్‌ను ప్రయాణికులు తమ మొబైల్‌ ఫోన్లలో కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక వీటికి అనుసంధానితమై ఉండే బ్యాంకు ఖాతాల నుంచి.. ప్రయాణికులు తన టిక్కెట్‌ ధరను డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు ద్వారా చెల్లించమ్చ. వాస్తవానికి.. ఆన్‌లైన్‌ ద్వారా టికెట్‌ విక్రయాలు కొంతకాలం క్రితమే అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే ఆచరణలో.. సాంకేతికపరమై సపమస్యల నేపథ్యంలో.. పూనర్తిస్థాయిలో ఈ విధానం అమలు కాలేదు. ఆ తర్వాత.. ఆయా లోపాలను సపరించిన తర్వాత.. తాజాగా మళ్ళీ అందుబాటులోకి తెచ్చారు. మరో పది, పదిహేను రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అందుబాటులోకి రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. రైల్‌ కం బస్‌ టిక్కెట్‌… కాగా, రైల్వెెతో కూడా టీఎస్సార్టీసీ తన సేవలను అనుసపంధానించనుంది. అంటే… రైల్వే కౌంటర్లు, ఆయా సెంటర్ల ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement