Monday, November 25, 2024

డాన్స్ చేస్తే ‘లవ్ జిహాద్’ అంటారా?

‘లవ్ జిహాద్’ అనేది.. హిందుత్వ సంస్థలు పెట్టిన పేరు. హిందూ మహిళలను ముస్లిం పురుషులు బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నట్టుగా ఈ పదం సూచిస్తుంది. ఇలాంటి పెళ్లిళ్ల ద్వారా హిందూ మహిళలను ఇస్లాం మతంలోకి మారుస్తున్నారని ఆ సంస్థలు ఆరోపణ. అయితే కేరళలో ఇద్దరు వైద్యులు సరదాగా చేసిన నృత్యంపై ఇప్పుడు లవ్ జిహాద్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

కేరళలోని త్రిస్సూర్ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య విద్యార్థులు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే, అమ్మాయి జానకి హిందూ, అబ్బాయి రజాక్ ముస్లిం మతానికి చెందిన వ్యక్తి అని తెలిసి.. ‘లవ్ జిహాద్’ అంటూ ట్రోల్స్ మొదలు పెట్టారు. దీంతో ఆ జంట మరి కొంత మంది వైద్య సిబ్బందితో కలిసి డాన్స్ చేసి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న బంధాన్ని లవ్ జిహాద్ పేరుతో, మతంలో పేరుతో రచ్చ చేస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement