టాలీవుడ్ యువ నటుడు అఖిల్ అక్కినేనికి ప్రస్తుత్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు! గతంలో రిలీజ్ అయిన సినిమాలన్నీ అంతగా హిట్ కాకపోవడంతో ఇప్పడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందతున్న యాక్షన్ డ్రామాగా ఏజెంట్‌తో బ్యాంగ్ కొట్టడానికి రెడీ అయిపోయాడు. ఈ సినమా కోసం పూర్తిగా తన శరీరాన్ని బిల్డ్ చేసుకున్నాడు అఖిల్. ఈ మూవీలో గూఢచారి పాత్రలో నటిస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ సినిమా బ్యానర్లపై రాంబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపారెడ్డి నిర్మించారు.
కాగా, సినిమా ఆగస్ట్‌లో థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది.. దీంతో మూవీ మేకర్స్ తమ డిజిటల్ ప్రమోషన్లతో సోషల్ మీడియాలో సందడి చేయడం స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే వారు ఈ సినిమా నుంచి కొద్ది సపటి క్రితం టీజర్ రిలీజ్ చేశారు.