ప్రపంచంలోని వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షుల్లో.. పాక్ ప్రధాని వ్యవహార శైలి అందరికంటే భిన్నంగా ఉంటుంది. ఎన్నికలు వచ్చినా.. రాజకీయంగా ఇబ్బందులు తలెత్తినా.. సెంటిమెంట్‌ను స్క్రీన్‌పైకి తీసుకొస్తారు. తాజా పాకిస్తాన్‌లో నెలకొన్నరాజకీయ అనిశ్చితిలోనూ.. ఇమ్రాన్ ఇదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాడు. అప్పటి వరకు ప్రజల బాధలు పట్టించుకోని ఖాన్.. తన పదవికి ఊడబోతున్నదని తెలిసినా వెంటనే.. ఆ ప్రజల మధ్యలోకి వెళ్లిపోయాడు. ప్రజల ముందు మొసలి కన్నీరు కారుస్తూ.. మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా.. పాకిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితులు ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇమ్రాన్ ఖాన్ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి. తన ప్రధాని పదవికి రాజీనామా చేసి హుందాగా బయటికి వచ్చేయడం. లేదంటే.. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడం.. ఆఖరి ఆప్షన్, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం.
చివరి బంతి వరకు పోరాటం..
క్రికెట్ ప్లేయర్‌గా ఇమ్రాన్ ఖాన్‌కు పోరాడే అలవాటు ఎక్కువే అని ఆయన మంత్రివర్గంలోని పలువురు బహిరంగంగానే ప్రకటించారు. ఆఖరి బంతి వరకు పోరాడే వ్యక్తితం ఇమ్రాన్ ఖాన్‌ది అంటూ చెప్పుకొచ్చారు. అంటే.. ఇక్కడ ఆఖరి బంతిగా అవిశ్వాస తీర్మానం ఉండనుంది. ఈ సమయంలో.. ఆ దేశ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఖమర్ జావెద్ బజా కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాకు వ్యతిరేకంగా తన గళం వినిపించారు. ఉక్రెయిన్‌పై దాడి నిలిపివేయాలన్నారు. ఓ చిన్న దేశంపై దాడిని తాము ఏ మాత్రం సహించలేమని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి ప్రాధాన్యత లేదని స్పష్టం అవుతున్నది. ప్రధాని పదవి నుంచి ఖాన్ గద్దె దిగడం ఖాయమైనట్టు కనిపిస్తున్నది. ఇమ్రాన్ ఖాన్.. రష్యాను వెనుకేసుకొచ్చాడు. తాజాగా బజ్వా చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకవేళ ఇమ్రాన్ ప్రభుత్వం అవిశ్వాసంలో నెగ్గినా.. సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే.. ఇమ్రాన్ ఖాన్‌కు సైన్యం గట్టిగానే బుద్ధి చెప్పే అవకాశాలు ఉన్నాయి.
ప్రాణహానీ ఉందన్న ఇమ్రాన్..
అవిశ్వాస తీర్మానం నెగ్గినా.. తనకు ప్రాణ హాని ఉందని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం తన వద్ద ఉందని చెప్పుకొచ్చారు. అయినా భయపడే ప్రసక్తే లేదని, దేశం కోసం ప్రాణాలు అర్పించేందుకు అయినా సిద్ధంగా ఉన్నా అని, ప్రజా సంక్షేమమే తన ధ్యేయం అంటూ చెప్పుకొచ్చారు. అవిశ్వాస తీర్మానం అవిశ్వాస తీర్మాన ఓటింగ్, రాజీనామా, ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనే ఆప్షన్లు సైన్యం తన ముందు ఉంచిందని ఖాన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి నేపథ్యంలో.. ముందస్తు ఎన్నికల వైపే తాను మొగ్గు చూపుతున్నట్టు ఇమ్రాన్ ప్రకటించడం గమనార్హం. బలవంతంగా రాజీనామా చేయించడం లేదా అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి సైన్యం చేతిలో బందీగా ఉండటం కంటే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఆయన కేబినెట్‌లోని పలువురు మంత్రులు కూడా ఇదే విషయమై.. చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. ముందస్తుకు వెళ్లి.. ప్రజల్లో తన బలం నిరూపించుకునే అవకాశం ఉత్తమమని రాజకీయ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..