కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఒకటి, రెండు కేసులు నమోదవుతూనే ఉండటంతో మొత్తం కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతోంది. బుధవారం కూడా కేరళలో కొత్తగా ముగ్గురికి జికా వైరస్ సోకింది. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 41కి చేరింది. ఈ విషయాన్ని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జి తెలిపారు. ఆ 41 మంది జికా వైరస్ ఇన్‌ఫెక్టెడ్ రోగుల్లో ఐదుగురు మాత్రమే పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని, మిగతా అందరి పరిస్థితి సాధారణంగానే ఉందని ఆమె తెలిపారు.
ఈ వార్త కూడా చదవండి: మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా?