బెంగాల్లో యువతిపై అత్యాచారం, హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. ఈ ముగ్గురూ ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్నారని సీబీఐ తెలిపింది. స్థానిక టీఎంసీ నాయకుడి కుమారుడు బ్రజా గోలాకు స్నేహితులుగా వీరిని భావిస్తున్నారు. బ్రజా గోలాను కూడా సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. ఏప్రిల్ 4న బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపించిన తర్వాత ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లవద్దని ఈ ముగ్గురు బాధితురాలి కుటుంబాన్ని బెదిరించినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. మరుసటి రోజు ఉదయం, పోస్టుమార్టం చేయకుండానే ఆమె మృతదేహాన్ని అనధికారిక శ్మశానవాటికలో హడావిడిగా దహనం చేశారు.
సీబీఐ విచారణ
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న కలకత్తా హైకోర్టు సీబీఐ కేసును అప్పగించింది. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయంచేయాలని ఆదేశించింది. బాధితురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆ ప్రాంత వాసులకు విశ్వాసం కలిగించాలని కోరుతూ సీబీఐకి కోర్టు ఈ కుసును అప్పగించింది. కాగా, ఈ కేసులో బాధిత కుటుంబానికి, సాక్షులకు పూర్తి రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
ఆ యువతి బర్త్ డే పార్టీకి వెళ్లిన సమయంలో ఆమెపై అత్యాచారం జరిగింది. మరుసటి రోజు ఆమె చనిపోయింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు బ్రజ్ గోపాల్ గోలా (21)గా పేర్కొటూ.. ఇతను స్థానిక టిఎంసి లీడర్ అని తేల్చారు. అతని ఒత్తిడి మేరకు మృతదేహాన్ని శవపరీక్ష చేయకుండానే దహనం చేశారని బాధితురాలి కుటుంబం ఆరోపించింది. ఏప్రిల్ 10న ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.