రెండు బస్సులు ఢీకొని ముగ్గురు మృతిచెందగా, మరో 30మంది గాయపడిన ఘటన గుజరాత్లో ఇవాళ చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే… శనివారం మల్పూర్ నుంచి వస్తున్న స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్సు డివైడర్ను దాటుకుని మొదాసా నుంచి మల్పూర్కు వెళ్తున్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో బస్సుల్లో ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
బస్సుల్లో చిక్కుకున్న వారు తమను కాపాడండని గట్టిగా నినదించారు. ప్రమాదం జరిగిన వెంటనే అటుగా వెళ్తున్న వారు, స్థానికులు క్షతగాత్రులకు సహాయం చేశారు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. తీవ్రంగా రక్తస్రావమై ముగ్గురు మృతిచెందగా, మరో 30మంది మాత్రం గాయాలతో బయటపడ్డారు. వారికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం సకారియా బస్ స్టేషన్ సమీపంలో జరిగింది. ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు.