Monday, December 23, 2024

Khalistan – యుపిలో ఉగ్ర‌ వేట – ముగ్గురు ఖ‌లీస్థాన్ టెర్ర‌రిస్ట్ లు హ‌తం ..

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో నేటి తెల్లవారుజామున భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ ప్రాయోజిత ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ టెర్రరిస్టులు ఈ కాల్పుల్లో ముగ్గురు చనిపోయినట్లు సమాచారం. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్‌ ఏరియాలో సంచరిస్తున్నట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే లపై యూపీ- పంజాబ్ పోలీసుల సంయుక్తంగా కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు.

ముందుగా ఈ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్లు గుర్తించిన పోలీసులు ఇంటింటి సోదాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగానే ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో చనిపోయిన గుర్‌విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గురుదాస్‌పూర్‌లో నివసిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే, నిందితుల నుంచి ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, భారీ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

కాగా, నిందితులు పంజాబ్ లోని ప‌లు ప్రాంతాల‌లో హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ్డారు.. వారి కోసం పోలీసులు వెతుకుతున్న క్ర‌మంలోనే వారు యుపికి పారిపోయారు. అక్క‌డి పోలీసుల‌కు పంజాబ్ పోలీసులు స‌మాచారం ఇవ్వ‌డంతో సోదాలు చేప‌ట్టారు .. ఈ క్ర‌మంలోనే ఎన్ కౌంట‌ర్ చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement