Monday, November 25, 2024

కరోనా థర్డ్ వేవ్‌కు మూడు మూలకారణాలు

కరోనా సెకండ్ వేవ్‌లో విధించిన లాక్‌డౌన్‌ను ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా అధికారులు సడలిస్తున్నారు. దీంతో ప్రజలు మాస్కులు ధరించకుండా ఇష్టారాజ్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. చిరుతిండ్లు విక్రయించే బళ్ల వద్ద గుంపులు, గుంపులుగా ఎగబడుతున్నారు. ఇలాంటి ఆకతాయిల పనుల వల్లే కరోనా థర్డ్ వేవ్ వస్తుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీరు కరోనా థర్డ్ వేవ్‌కు సూపర్ సెల్ఫ్‌గా మారుతున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రధానంగా మూడు ప్రధాన కారణాలను కరోనా థర్డ్ వేవ్‌కు మూలంగా అధికారులు భావిస్తున్నారు. విచ్చలవిడిగా వాహనాలపై త్రిబుల్ రైడింగ్, చిరుతిండ్ల వద్ద అధిక రద్దీ, అధిక సామర్థ్యంతో వెళ్లే ఆటోలు కరోనా థర్డ్ వేవ్‌కు కారణమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మూడు సమస్యలను అధికారులు అరికట్టలేకపోతే ఒకవేళ లాక్‌డౌన్, కర్ఫ్యూ విధించినా పెద్దగా ఒరిగేదేమీ లేదని భావిస్తున్నారు. పోలీసులు, నగర, పురపాలక సంఘాలు, ఇతర శాఖల అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటే మూడో వేవ్‌ను నియంత్రించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అడ్డూ, అదుపు లేకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్లు తిరిగేవారిని పట్టుకుని కనీసం వారంపాటు జైలులో పెట్టాలని వారు సూచిస్తున్నారు.

ఈ వార్త కూడా చదవండి: సాగర్ సమీపంలో కూలిన హెలికాప్టర్

Advertisement

తాజా వార్తలు

Advertisement