Tuesday, November 26, 2024

ఏపీ ప్రజలను బెంబేలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్.. మరో ముగ్గురు మృతి

ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యాధి బారిన పడి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు గుంటూరు జిల్లా వారు కాగా, ఒకరు కర్నూలుకు చెందిన వారు. వీరందరూ కరోనా నుంచి కోలుకున్న వారే కావడం గమనార్హం. మరోవైపు ప్రకాశంలో ఈ ఫంగస్ శరవేగంగా వ్యాపిస్తోంది. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 36 మందిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించాయి. వీరిలో 20 మంది ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నలుగురికి అత్యవసర ఆపరేషన్ అవసరం కావడంతో విజయవాడ, హైదరాబాద్ తరలించారు.

ఇక కర్నూలు జిల్లా నాగులాపురానికి చెందిన కేవీ ప్రసాద్ (68) ఈ వ్యాధి బారినపడి మృతి చెందారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం నాడు మరణించాడు. కృష్ణా జిల్లాకు చెందిన చింతా వెంకటేశ్వరరావు (64) బ్లాక్ ఫంగస్ లక్షణాలతో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అలాగే గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన కట్టా సాంబయ్య (55) వారం రోజులుగా గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement