హైదరాబాద్ నగరంలోని మీనా జ్యువెల్లర్స్ పై కేసులు నమోదయ్యాయి. రుణాలు చెల్లించలేదని మూడు కేసులు నమోదయ్యాయి. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టారని సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కేసులు నమోదు చేసింది. అలాగే డైరెక్టర్ ఉమేష్ జత్వానిపై కూడా కేసు నమోదు చేశారు. ఎస్బీఐ ఆధ్వర్యంలోని కన్సార్టియం నుంచి రూ.364.2కోట్ల రుణం తీసుకొని మోసం చేశారని కేసు నమోదు చేశారు. 2016-20 మధ్య రూ.810కోట్ల లావాదేవీలు నిర్వహించిందని, బ్యాంకుల్లో రూ.70కోట్లు మాత్రమే జమచేశారని ఆరోపణలున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital