Friday, November 22, 2024

దక్షిణ మధ్య రైల్వేకు ఇంధన సామర్ధ్యంలో మూడు అవార్డులు

అమరావతి, ఆంధ్రప్రభ: 23వ నేషనల్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ – 2022లో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (ఈఒఒ) ద్వారా జోన్‌లోని మూడు అడ్మినిస్ట్రేటివ్‌ యూనిట్లకు ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డులు దక్షిణ మధ్య రైల్వేకు లభించాయి. 2022 సంవత్సరం మరియు న్యూ ఢిల్లీలో జరిగిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో ఈ అవార్డుల ప్రదానం చేసినట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ భవనానికి గానూ హైదరాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శ్రీ శరత్‌ చంద్రయాన్‌, హైదరాబాద్‌ భవన్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ భవనాలకు సీనియర్‌ డివిజనల్‌ ఎలక్ట్రిక్రల్‌ ఇంజనీర్‌లతో పాటు ఇతర అధికారులు అవార్డులు అందుకున్నారు.

కాచిగూడ స్టేషన్‌ బిల్డింగ్‌కు ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్‌ అవార్డు వరుసగా మూడోసారి పొందిందని, దీనికితోడు ఎనర్జీ ఎఫిషియెన్సీకి అత్యున్నత పురస్కారమైన నేషనల్‌ ఎనర్జీ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ప్రకటించారని ఆ ప్రకటనలో దక్షిణమధ్య రైల్వే పేర్కొంది.. హైదరాబాద్‌ భవన్‌, లింగంపల్లి రైల్వే స్టేషన్‌ బిల్డింగ్‌ (సికింద్రాబాద్‌ డివిజన్‌) భవనాల విభాగంలో ఎనర్జీ ఎఫిషియెంట్‌ యూనిట్లు-గా అవార్డు పొందాదని తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే అనేక సంవత్సరాలుగా జాతీయ స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో నిరంతరంగా ఇంధన పరిరక్షణ అవార్డులను అందుకుంటోందని దక్షిణ మధ్య రైల్వే ఆ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement