Saturday, November 23, 2024

యూపీ సీఎం యోగిని చంపేస్తామంటూ బెదరింపు

ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను బాంబులు వేసి చంపేస్తామంటూ పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఓ వ్యక్తి బెదరింపు సందేశాన్ని పంపాడు. ఆ బెందరింపు సందేశాన్ని పంపిన వ్యక్తిని షాహిద్‌గా గుర్తించారు. ఎమర్జెన్సీ వాట్సాప్‌ హెల్ప్‌ లైన్‌.. డయల్‌ -112కు వాట్సాప్‌ ద్వారా సోమవారంనాడు ఈ మెసేజ్‌ను పంపినట్లు గుర్తించి కేసు నమోదు చేశామని సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ కమాండర్‌ సుభాష్‌ కుమార్‌ తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలతోపాటు సైబర్‌ నిఘా బృందాలు రంగంలోకి దిగాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement