జైభీమ్ చిత్రంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మూవీలో తమిళ స్టార్ హీరో సూర్య నటించాడు.వన్నియార్ సంఘం ప్రతిష్ఠను గిగజార్చుతున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. నిర్మాతలు సూర్య ,జోతిక , దర్శకుడు టీజే జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోల వన్నియార్ సంఘం నోటీసులు కూడా పంపింది. ఈ నేపథ్యంలో హీరో సూర్య కు కూడా పలు బెదిరింపులు వచ్చాయి. దాంతో సూర్యకు పోలీసులు బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. చైన్నై లోని సూర్య నివాసంలో ఆర్మ్డ్ పోలీస్ లను ఏర్పాటు చేశారు.
సూర్య ఇంటి లోపల ఐదుగురు సాయుధ పోలీసులను మోహరించారు. ఇదిలా ఉంటే జై భీమ్ సినిమాలో కొన్ని సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ వన్నియార్ సంఘం ఆరోపిస్తుంది. ఈ సినిమాపై నెలకొన్న వివాదం రోజు రోజుకీ ముదురుతోంది. జై భీమ్ సినిమాలో పై వన్నియర్ వర్గాల నేతలు విరుచుకుపడుతున్నారు. అంతేకాదు ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్య ని కొట్టిన వారికీ ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని పీఎంకే నేతలు ప్రకటించి సంచలనం సృష్టించారు. జై భీమ్ సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణ చేస్తున్నారు. రూ. 5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని జై భీమ్ నిర్మాత సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily