Wednesday, November 20, 2024

మా పిల్లల్ని కాపాడమ్మా.. కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్తున్న ఉక్రెయిన్ వాసులు!

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో శరణార్థులను చూస్తే కడుపుతరుక్కుపోతుంది. రష్యా యుద్ధం నేపథ్యంలో 18 నుంచి 60 ఏళ్లలోపువారు దేశం విడిచి వెళ్లరాదని ఉక్రెయిన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలను సురక్షితంగా సరిహద్దు దేశాలకు తీసుకువెళుతున్నారు. కట్టుబట్టలతో పిల్లల్ని చంకనెత్తుకుని పదుల కి.మీ. నడచి వెళ్లేవారు కొందరు. అంతదూరం బరువు మోయలేక సామాన్లు మధ్యలోనే వదిలేసి పిల్లలతో వెడుతున్నవారు మరికొందరు… గడ్డకట్టే చలిలో ప్రాణాలకు తెగించి వెళ్లతున్నవారు ఇంకొందరు.. ఇలా ఎటు చూసినా హృదయం ద్రవించే దృశ్యాలే. అలాంది స్థితిలో ఓ మనసు కదిలించే, మానవీయ దృశ్యం ఆవిష్కృతమైంది. ఓ రవాణా వాహనంలో హంగేరి సరిహద్దులకు తన ఇద్దరు చిన్నారులతో
ఉక్రెయిన్‌ వ్యక్తి ఒకరు చేరుకున్నారు. సరిహద్దులు దాటి వెళ్లడానికి భద్రతా బలగాలు అంగీకరించలేదు. హంగేరివైపు నటాలియా అబ్లెయెవా అనే పూర్వపరిచయం లేని మహిళ కన్పించింది. ఆమె వయసు 58 ఏళ్లు. ఎలాగైనా పిల్లల్ని కాపాడాలని తండ్రి తపన. చివరికి ఆమెకు తన ఇద్దరు పిల్లల్ని అప్పగించేశాడు. వారి పాస్‌పోర్టులు, ఇతర ఆధారపత్రాలు నన్ను నమ్మి అప్పగించారు. ఆ ఇద్దరు పిల్లల్ని ఆమె అక్కున చేర్చుకుని తీసుకువెళ్లింది. ఇంతలోఆ ఇద్దరి పిల్లల తల్లి అక్కడకు చేరుకుని సరిహద్దు అవతలున్న పిల్లల్తొ ఫోన్‌లోమాట్లాడి కన్నీరుమున్నీరయ్యారు. ఇలాంటి ఎన్నో దృశ్యాలు అక్కడ కన్పిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement