తాడేపల్లి,ఫిబ్రవరి22(ప్రభ న్యూస్) తాడేపల్లి ఉండవల్లి దేవుని మాన్యంలో మహా మృత్యుంజయ విశ్వశాంతి మహాయాగం భూమి పూజ కార్యక్రమంలో బి అర్ ఎస్ పార్టీ ఏపి అధ్యక్షుడు తోట చంద్ర శేఖర్.పాల్గొన్నారు. ఈ సందర్బంగా తోట మాట్లాడుతూ కేసీఆర్ పవన్ కళ్యాణ్ కి 1000 కోట్లు ఆఫర్ చేశారని చెప్తున్న వారి దిగజారుడుతనానికి అర్థం పడుతుంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
రాష్ట్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.దేశంలో రైతాంగ సమస్యలను ఏ ఒక్క పార్టీ పట్టించుకోలేదని అన్నారు.ఏపీ కి రాజధాని లేకపోవడం ప్రజల దురదృష్టమని బి అర్ ఎస్ పార్టీ అన్నీ రాష్ట్రాలలో విస్తరిస్తుందని అన్నారు.ముఖ్యమైన రైతాంగ సమస్యల పై బిఆర్ఎస్ దృష్టి పెడుతుందని అన్నారు.
నిరుద్యోగం,ధరల నియంత్రణ లేకపోవడం ప్రధానంగా ఉన్నా సమస్యలని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విభజన హామీలను సాధించుకోవాలని అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల సాధనలో వైసిపి,టిడిపి పార్టీలు విఫలం అయ్యాయిని అన్నారు.పెద్ద పార్టీల లీడర్ల ను అవహేళన చేసే అభియోగాలు మోపడం తగదని అన్నారు.పొత్తులు ఏ పార్టీతో అయినా పెట్టుకోవచ్చని అన్నారు.పొత్తు మేము పెట్టుకుంటే సంసారం ఇతరులు పెట్టుకుంటే వ్యభిచారం అన్నట్టు మాట్లాడడం సరికాదని
అన్నారు.పొత్తు కోసం కేసీఆర్ డబ్బు ఆఫర్ చేశారని అభియోగాలు చేయడం వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసినట్టు అవుతుందని దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయం బి అర్ ఎస్ పార్టీ అని అన్నారు.